Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో కార్మిక భవనం కోసం శంకుస్థాపన
- 15 వేల మంది కార్మికుల తో బహిరంగ సభ మంత్రి జగదీశ్ రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
భవన నిర్మాణ కార్మికులందరూ ఏకమై ఒకే సంఘంగా ఏర్పడటం శుభపరిణామమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో సంఘం గౌరవ అధ్యక్షులు, మున్సిపల్ వైస్ చైర్మెన్‌్ పుట్టా కిషోర్ ఆధ్వర్యంలో సంఘ పెద్దలు మంత్రి కి కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలన్నారు. క్రమశిక్షణతో ఉండి భవన యజమానుల మనసును చూరగొనాలని పేర్కొన్నారు. కార్మికుల అంతా లేబర్ ఇన్సూరెన్స్ ను కలిగి ఉండాలని సూచించారు. ఇన్సూరెన్స్ పాలసీ కి అయ్యే ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు. బానుపురి భవన కార్మిక సంఘం గా ఏర్పడిన శుభ సందర్బంగా ఉగాది కానుకగా కార్మిక భవన నిర్మాణానికి శంకస్థాపన చేయనున్నట్లు మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కుర్ర నర్సయ్య యాదవ్, ప్రథాన కార్యదర్శి బిమ్మగాని వెంకన్న గౌడ్ తో పాటు, పెయింటర్స్ సంఘం అధ్యక్షుడు పేరాల వెంకన్న, ఎలక్ట్రిషన్ సంఘం అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి బొమ్మగాని వెంకన్న, ఇరుగు సంజీవ, ప్లంబర్ సంఘం అధ్యక్షుడు చినగాని గోవర్ధన్, మార్బుల్ అండ్ గ్రానైట్ అధ్యక్షుడు దుబ్బ ప్రేమ్, టైల్స్ సంఘం అధ్యక్షుడు బొట్టు శ్రీను, మట్టి పని వారి సంఘం అధ్యక్షుడు కొంచెం వెంకటేష్, రాడ్ బైండింగ్ సంఘం అధ్యక్షుడు దాసరి నగేష్, సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షుడు నిమ్మల వెంకన్న, రఫీ, పిఓపి యూనియన్ అధ్యక్షులు బొల్లి కొండ వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.