Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిలుకూరు
దేశ రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లా మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో బీఅర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం బేతవోలు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గడపగడపకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే గులాబి పార్టీ లక్ష్యం అన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడేది గులాబీ పార్టీ మాత్రమే అని తెలిపారు. పార్టీ కన్నతల్లి లాంటిదని కీలక పాత్ర పోషించిన కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొండా సైదయ్య, ప్రధాన కార్యదర్శి నలబోలు శ్రీనివాసరెడి,్డ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దొడ్డ సురేష్, మాజీ ఎంపీపీ బజ్జూర్ వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ బట్టు శివాజీ, సొసైటీ చైర్మెన్లు జనార్ధన్, సైదులు, వైస్ చైర్మెన్ అక్కినపల్లి జానకి, రామాచారి, గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లూరి శీను, కస్తూరి నర్సయ్య, కడియాల వెంకటేశ్వర్లు, సర్పంచులు శంకర్, నందలాల్ తదితరులు పాల్గొన్నారు.