Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమ్యూనిటీ హాల్ మంజూరైంది శంకుస్థాపనకు మంత్రి వస్తున్నారని చెప్పిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు
- మంత్రి గ్రామానికి వచ్చి కాలనీకి రాలేదని నిరసన
నవ తెలంగాణ -ఆత్మకూరు ఎస్
మండల పరిధిలోని మక్త కొత్తగూడెం గ్రామంలోని వడ్డెర కాలనీలో కమ్యూనిటీ హాల్ కోసం గురువారం మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తారని ఆశ పెట్టుకున్న కాలనీ వాసులకు మంత్రి గ్రామం లోకి వచ్చి కాలనీకి రాక పోవడంతో వడ్డెర కాలనీ వాసులు నిరాశకు లోనయ్యారు. స్థానిక ప్రజా ప్రతినిధులు వడ్డెర కాలనీకి కమ్యూనిటీ హాల్ మంజూరు అయిందని నేడు మంత్రి జగదీశ్వర్ రెడ్డి కమ్యూనిటీ హాల్ శంకుస్థాపనకు కాలనీకి వస్తున్నారని చెప్పడం తో వేల రూపాయలు ఖర్చు చేసి టెంట్, ఫ్లెక్సీ లు, పూల దండలు, మైక్‌లు ఏర్పాటు చేసుకున్నారు. స్థలాన్ని శుభ్రం చేసిపెట్టారు.మంత్రి రాక కోసం ఎదురు చూసిన వారికి గ్రామం లో గ్రామ పంచాయతీ భవనం శంకుస్థాపన చేసి వెళ్లిపోయారు.మంత్రి తమ కాలనీ కి రాక పోవడం తో నిరాశ తో నిరసన కు లోనయ్యారు.కమ్యూనిటీ హాల్ మంజూరు అయిందని చెప్పిన బీ ఆర్ ఎస్ ప్రజాప్రతినిధుల మాటలు భూటకమని గ్రహించిన వడ్డెర కాలనీ వాసులు ఆగ్రహం తో తాము అభిమానం తో పెట్టిన ఫ్లెక్సీ లను తగుల బెట్టారు.కమ్యూనిటీ హాల్ స్థలాన్ని కాంగ్రెస్ హయాంలో మాజీ మంత్రి రాంరెడ్డ్డి దామోదర్ రెడ్డి కేటాయించారని ఆ స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తారని ఏళ్ల తరబడి చూస్తే తమ సమస్య పట్టించు కోవడంలేదని మండిపడ్డారు. శంకుస్థాపనకు కట్టిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను, మంత్రి జగదీష్ రెడ్డి ఫొటోలను, జెండాలను కాలనీవాసులు తగలబెట్టారు. బీఆర్ఎస్ నాయకులు ఎవరు తమ కాలనీకి రావద్దని హెచ్చరించారు.