Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్
నవతెలంగాణ -తుంగతుర్తి
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం జీవితం నేటి తరానికి ఆదర్శమని ఆ పార్టీ మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని విఎన్ భవనంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ నెల 19న రాయినిగూడెంలో నిర్వహించే మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి సభను జయప్రదం చేయాలని కోరారు.తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, కమ్యూనిస్టు ముద్దుబిడ్డ, మల్లు స్వరాజ్యం తెలంగాణ సాయుధ పోరాటంలో 13 సంవత్సరాల వయసులోనే తుపాకీ పట్టి తన అన్నగారైన భీమ్ రెడ్డి నరసింహారెడ్డితో ఈ ప్రాంత ప్రజల విముక్తి కోసం పోరాటం చేసిందని అన్నారు. స్వరాజ్యం స్ఫూర్తితో నేటి యువత ముఖ్యంగా మహిళలు ప్రజా పోరాటాలలో చురుకుగా పాల్గొని దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు విష్ణుమూర్తి, దేవరాజ్, ఓరుగంటి అంతయ్య, రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.