Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 141 మున్సిపాలిటీలలో ఈ మార్కెట్ రోల్ మోడల్ గా నిలుస్తుంది
- తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ శ్రీధర్
నవతెలంగాణ-సూర్యాపేట
ఏషియాలో ప్రతిష్టాత్మకంగా సూర్యాపేట పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం జరుగుతుందని మరో నెలలో పనులన్నీ పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధం చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖా చీఫ్ ఇంజనీర్ శ్రీధర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన జమ్మిగడ్డలోని ఎస్టీపీ ప్లాంట్ ను, చివరి దశలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. జమ్మిగడ్డలో ఎస్ టి పి ప్లాంట్ నిర్మాణం పూర్తి అయిందని అండర్ గ్రౌండ్ వద్ద పైప్ లైన్ వద్ద కనెక్షన్ ఇవ్వాల్సి ఉందన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం ఏషియాలో ప్రతిష్టాత్మకంగా నిలుస్తుందన్నారు. ఈ భవనంలో 165 కమర్షియల్ షాపులతో పాటు వివిధ వ్యాపారులకు అనుగుణంగా ఫ్లాట్ ఫార్మ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా కూరగాయలు, పండ్లు, పూలు, మటన్ అన్ని ఒకే చోట దొరికేలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు అనుబంధంగా వెజ్, నాన్ వెజ్, ఫ్లవర్ మార్కెట్లతో పాటు క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలలో ఏర్పాటు చేస్తున్న మార్కెట్లలో ఇది రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. మరో నెల రోజుల్లో పనులు పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్ధమవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి రామానుజుల రెడ్డి, కోదాడ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, టీయుఎఫ్ఐ డీసీఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ పీహెచ్ సత్యనారాయణ, ఈఈ జి కే డి ప్రసాద్, డీఈ సత్య రావు, రమాదేవి, ఓ.స్వాతి ,ఏఈలు సుమంత్, వరుణ్ , నరేందర్ ,ఎస్.ఎస్.ఆర్ .ప్రసాద్ కాంట్రాక్టర్ కట్టా .వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.