Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ ఎంసీ. కోటిరెడ్డి
నవతెలంగాణ-తిరుమలగిరిసాగర్
గ్రామ రైతులు ఉచిత పశువైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బోయగూడెం గ్రామంలో పశుసంవర్ధకశాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశు గర్భాకోశ వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి గ్రామ రైతులకు పశువైద్య మందులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీని పశు వైద్య సిబ్బంది శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భగవాన్‌నాయక్, వైస్ ఎంపీపీ దిలీప్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ నెమలి సునీత కృష్ణారెడ్డ్డి, బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు బీవీ.రమణ రాజు, మాజీ చైర్మెన్ వెంకట్‌రెడ్డి, గ్రామ రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ కున్రెడ్డి లింగారెడ్డి, మాలె సత్యంరెడ్డి, గ్రామ గొర్ల కాపర సంఘం అధ్యక్షుడు మేండే సైదులుయాదవ్, జిల్లా పశు వైద్య అధికారీ(ఈఓ)(డీఎల్ డీఏ) డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, మండల పశు వైద్య అధికారి డాక్టర్ కేశవ్ అజ్మీరా, తదితరులు పాల్గొన్నారు.