Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15,500 రూపాయలు జీతం
- పని భారం రెండు గంటలు పెంపు
- వేతన కేటాయింపులో తీవ్ర అన్యాయం
నవతెలంగాణ-ఆలేరురూరల్
ఆరోగ్యశ్రీలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య మిత్రలకు సరైన క్యాడర్ లేకపోవడంతో వేతన కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రూ. 3500 వేతనంతో డిగ్రీ పీజీ అర్హతతో రోస్టర్ ప్రతిపాదికన ఆరోగ్య మిత్రులుగా నియమితులయ్యారు. కొన్ని ఏండ్లు గడిచిన వేతనం మాత్రం పెరగలేదు. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడిన తర్వాత వేతనాలు పెంచాలని నిరవధిక సమ్మెలు చేశారు. ఆరోగ్య మిత్రలకు సరైన న్యాయం చేస్తామని వేతనాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది తదనంతరం జరిగిన పరిణామ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడు కేటగిరిగా విభజించి వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఆయా శాఖలకు ఉత్తర్వులు జారీ చేసింది. తమకు రెండవ కేటగిరీలో వేతనాలు పెంచుతారేమోనన్న ఆశ పడిన ఆరోగ్య మిత్రులకు నిరాశ మిగిలింది. కేటగిరి మొదటి స్థానంలో నివేదిక ప్రభుత్వానికి పంపించారు. అప్పుడు దాని ప్రకారం 15 వేల 500 రూపాయలు వేతనం ప్రారంభమైంది. తమకు వేతన విషయంలో అన్యాయం జరిగిందని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. మంత్రులను అధికారులను కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఆరోగ్య మిత్రులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు కూడా దాని ఊసే లేకుండా పోయింది పలుసార్లు మంత్రులతో కలుస్తున్న న్యాయం లేకుండా పోయింది. చాలి చాలని జీతంతో ఉదయం లేచి 9 గంటల ప్రాంతంలో డ్యూటీకి వెళ్లాలంటే చాలా కష్టంగా ఉంది. తక్కువ జీతంతో పనిచేస్తున్నప్పటికీ ఏప్పటికైనా జీతం పెరగబోతుందేమో అన్న ఆశతో విధులు సాగిస్తున్నారు. అంతేకాకుండా పని భారం కూడా పెరుగుతుంది. 8 గంటలు చేయవలసిన డ్యూటీ అదనంగా రెండు గంటలు ఆయుష్మాన్ భారత్ పేరుతో ఎక్కువ చేయించుకుంటున్నారు. ఆరోగ్య శ్రీ లో చికిత్సలు పారదర్శకంగా ఉండేలా చికిత్స నిర్వహిస్తూ ఆరోగ్యశ్రీ పథకానికి ప్రపంచంలోనే మంచి గుర్తింపు రావడానికి ఆరోగ్య మిత్రుల కృషి మరువలేనిది.
పని భారం తగ్గించాలి
సుమ ఆరోగ్య మిత్ర
ప్రభుత్వం గతంలో ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయాలని సూచించింది. ఇప్పుడు రెండు గంటలు అదనంగా పని చేయాలని ఆర్డర్ వేస్తున్నారు. గతంలో శారాజిపేట పిహెచ్సీ సెంటర్లోనే ఆరోగ్య మిత్ర సెంటర్ ఉండేది. కానీ ఆలేరుకు మార్చడంతో ఇబ్బందిగా ఉంది. శారాజిపేట గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు పి ఎస్ సి సెంటర్ లో నమోదు చేసుకునే వారు చుట్టుపక్కల ఉండే ప్రజలు ఆలేరుకు రావడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. పాత పద్ధతిలోనే సెంటర్ శారాజిపేటలో ఏర్పాటు చేయాలి.
వేతనం సరిపోవడం లేదు
మొగులగని కటమయ్యా ఆలేరు ఆరోగ్య మిత్ర
కొలువు చేయబట్టి 16 సంవత్సరాలు అయితున్నప్పటికీ వేతనం మాత్రం పెంచడం లేదు 15,500 మాత్రమే నెలకు ఇస్తున్నారు కుటుంబం పోషించాలంటే నాన్న ఇబ్బందులు పడవలసి వస్తుంది ప్రభుత్వం జీతం పెంచుతామని చెప్పి ఇప్పుడు పెంచకపోవడం బాధాకరంగా ఉంది నిత్యవసర వస్తువులు పెంచడంతో ఇంట్లో పూట గడవడం ఇబ్బందిగా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం మా యందు దయ తలచి వేతనాలు పెంచాలి.