Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం
- బీసీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకరం కోటంరాజు
నవతెలంగాణ-భువనగిరి
కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5 న ఛలో ఢిల్లీ కార్యక్రమంలో జిల్లా నుండి అధిక సంఖ్యలో పాల్గొనాలని బిసిడబ్ల్యుఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకరం కోటంరాజు కార్మికులకు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవన్ లో జరిగిన భవన నిర్మాణ కార్మికుల యూనియన్ జిల్లా కమిటి సమావేశంలో కోటంరాజు పాల్గొని మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన 1996 కేంద్ర చట్టం, 1998 సెస్స్ చట్టం, 1979 అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టాలను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. పెంచిన నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని అన్నారు. నిర్మాణ రంగానికి ఉపయోగించే ముడి సరుకుల ధరలను తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గొరిగె సోములు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, నాయకులు కూరెళ్ళ నర్సింహ, తూటి వెంకటేశం, పోతరాజు జహంగీర్, బొడ్డుపల్లి వెంకటేశ్, గాడి శ్రీనివాస్, వంగాల మారయ్య, ఎస్కె శ్రీను పాల్గొన్నారు.