Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలాసత్పతి
నవతెలంగాణ-ఆత్మకూర్ ఎం
ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు . మండలంలోని కప్రాయపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం శిబిరాన్ని శుక్రవారం ఆకస్మికంగా ఆమె సందర్శించి పరిశీలించారు. శిబిరం వద్ద ప్రజలకు మందుల, కంటి అద్దాల పంపిణీ సేవలను ప్రజలను అడిగి ఆమె తెలుసుకున్నారు. రికార్డులను ఆమె పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఉన్న నర్సరీని పరిశీలించారు హరితహారం కార్యక్రమంలో పంపిణీ చేయుటకు మొక్కలను సిద్ధం చేయాలని ఆమె సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్ఓ యాదగిరి డాక్టర్ విలియం కేరి ఆర్ఐ యాదగిరి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.