Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వలిగొండ
మండల కేంద్రంలోని స్థానిక మేజర్ గ్రామపంచాయతీలో భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆలేరు మండలం కాచారం గ్రామానికి చెందిన బర్మ శ్రీధర్ హైదరాబాదులో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో శుక్రవారం చౌటుప్పల్ డీఎల్పీఓ సాధన వలిగొండ గ్రామపంచాయతీలో విచారణ నిర్వహించారు. బర్మా శ్రీధర్ మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం సమాచార హక్కు చట్టం కింద 2019 నుండి22 వరకు గ్రామపంచాయతీకి వచ్చిన వివిధ వరుల ద్వారా ఆదాయం వ్యయాలు బిల్లుల రూపంలో సమగ్ర సమాచారం ఇవ్వాలని దరఖాస్తు చేసినట్లు తెలిపారు ఆరు కోట్ల 66 లక్షల పైన ఆదోని వచ్చిందని ఎం బిల్లులు రికార్డులు మూడు కోట్లకు బిల్లులు చూపిస్తూ మిగతా మూడు కోట్లకు సరైన రికార్డులు ఏం బిల్లులు సమాచారం ఇవ్వడం లేదన్నారు అందులో భాగంగానే గ్రామపంచాయతీలో జరిగిన భారీ అవినీతికి విచారణ నిర్వహించాలని పంచాయతీరాజ్ కమిషనర్ కు కలెక్టర్కు వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు మోటార్ల పనులలో అవినీతి బోరు ప్రెస్సింగ్ లో అవినీతి వైకుంఠధామం పల్లె ప్రగతి వనం నర్సరీ రైతు వేదిక అనేక అంశాలను అడ్వాన్స్ డబ్బులు డ్రా చేసుకొని పైన తెలిపిన పథకాలకు డబ్బులు వచ్చినా గ్రామపంచాయతీలో జమ చేయకపోవడం సంబంధం లేని వ్యక్తుల మీద లక్షలాది రూపాయలు డ్రా చేయడం అనేక అంశాలపై ఇతర నిర్వహించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.