Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాసమస్యలపై పోరాటం చేస్తాం
- కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-భువనగిరి
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి విఫలమయ్యారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. పట్టణంలో ప్రజా సమస్యల తెలుసుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హత్ సే హాత్ జోడ యాత్ర శుక్రవారం 23వ వార్డు ఇందిరానగర్ కోట మైసమ్మ గుడి నుండి ప్రారంభించారు. స్థానిక కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి హాత్ సే హాత్ జోడ యాత్ర ప్రారంభించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఆనాడు ఇందిరాగాంధీ ఇచ్చిన ఇండ్లలోనే ఇప్పటివరకు నివాసముంటున్నారన్నారు. ఒక్క ఇంట్లోనే నాలుగు కుటుంబాలు జీవనం సాగిస్తున్న దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 40ఏండ్ల భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ యేతర ఎమ్మెల్యేలు గెలిచి పట్టణ అభివృద్ధి , స్లం ఏరియాలు వెనుకబడ్డ దళిత వాడలను నిర్లక్ష్యం చేయడానికి ముఖ్య కారణమన్నారు. రానున్న ఆరు నెలలో వచ్చే ఎన్నికలలో భువనగిరి పట్టణం అభివృద్ధి విషయంలో ప్రజల పట్ల నిర్లక్ష్యం చేసి తొమ్మిది సంవత్సరాల నుండి ప్రజల వైపు చూడని ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి డబ్బులు ఇచ్చి ఎన్నికలలో ఓట్లు వేసుకోవచ్చని అహంభావంతో ఉన్నాడన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ చూసి జీర్ణించుకోలేక ప్రజల మధ్యలోకి వచ్చిమభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్ల ప్రకారమే ఇండ్లను నిర్మాణం కోసం ఐదు లక్షలు ఇస్తామని తెలిపారు. జోడో యాత్రలో భాగంగా ఇందిరానగర్, దోబీవాడలకు ఇందిరమ్మ వాటర్ ప్లాంటును సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ , మున్సిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహంగీర్, పిసిసి డెలికేట్ తంగళ్ళపల్లి రవికుమార్, సత్యనారాయణ ,సోమయ్య,ఆదినారాయణ కొల్లూరి రాజు దర్గాయి దేవేందర్ నువ్వుల రాజు ,తోట మహేందర్ ,బట్టు మహేందర్ ,గోపే బాబు, బర్రె ప్రభాకర్, సాయి ,రాజేష్, లింగం ,పోచయ్య, జమ్మయ్య, నరసింహ ,కిష్టయ్య పాల్గొన్నారు.