Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
మండలంలోని సీతారాంపురం గ్రామ సర్పంచ్ మలిపెద్ది మాధవి మాధవరెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై శుక్రవారం యాదాద్రి డీఎల్పీఓ కొమ్మగళ్ళ యాదగిరి విచారణ జరిపారు.గ్రామపంచాయతీ కార్యా లయంలో రికార్డులను పరిశీలించారు.గ్రామ సర్పంచ్ వాటర్ ప్లాంట్,చేపల చెరువు టెండర్, గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని గ్రామానికి చెందిన జోగు శ్రీశైలం 2023 ఫిబ్రవరి 20,27 తేదీల్లో కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో డీఎల్పీఓ యాదగిరి గ్రామాన్ని సందర్శించి నిధుల దుర్వినియోగం పై ప్రాథమిక విచారణ జరిపారు.గ్రామంలోని వాటర్ ప్లాంట్,చేపల చెరువు టెండర్,గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలపై ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం రికార్డులు సీజ్ చేసి సమగ్ర విచారణ చేసి జిల్లా కలెక్టర్ కి నివేదిక ఇవ్వనున్నట్లు డీఎల్పీఓ తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జి ధనుంజయ,ఉప సర్పంచ్ పాలడుగు మల్లేష్ వార్డు సభ్యులు మలిపెద్ది మంజుల,కాలి వెంకన్న,కూరెళ్ల సుజాత,అరిగే సరస్వతి,ఏనిగే సోమయ్య,మచ్చ కమలమ్మ,పిల్లలమర్రి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.