Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.10 లక్షలతో నిర్మాణం
- పగుళ్లుపట్టిన సీసీరోడ్డు
నవతెలంగాణ-భువనగిరిరూరల్
నాసిరకంగా సీసీ రోడ్డు పనులు చేపట్టడంతో పది రోజులకే పగుళ్లు పట్టిన సంఘటన మండల పరిధిలోని నమత్పల్లి గ్రామ శివారులోని శ్రీసుదర్శన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద చోటుచేసుకుంది. వివరాలను పరిశీలిస్తే ..భువనగిరి ఎమ్మెల్యే సహకారంతో రూ.10 లక్షలు సీసీి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఆలయ చైర్మెన్ అతికం లక్ష్మీనారాయణగౌడ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సీసీ రోడ్డు వేయించారు. 10 లక్షలతో సీసీి రోడ్డు పది రోజులకే పగులు రావడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. దేవాలయం వద్ద ఏర్పాటుచేసిన సిసి రోడ్డు పనులలో నాణ్యత ఈ విధంగా ఉంటే సాధారణంగా గ్రామాలలో చేపట్టే పనుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి మండలంలో నెలకొంది. దేవాలయ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నిధులు మంజూరు చేసిన ఆలయ చైర్మన్ నాణ్యత లోపంతో పనులు చేపట్టడం వలన భక్తులు గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా 10 లక్షల సిసి రోడ్డు నిర్మాణానికి కొందరు దాతలు సిమెంటు ఇసుక ఇతర సామాగ్రి భక్తులు విరాళంగా అందజేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే సహకారం భక్తుల విరాళాలు అందజేసినప్పటికీ నాసిరకంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.
ఈ విషయంపై భువనగిరి పంచాయతీరాజ్ ఏఈని వివరణ కోరగా నాణ్యత లోపం లేదని , నాణ్యత ప్రకారమే పనులు చేపట్టామని తెలిపారు.
పనులు నాణ్యతగా చేపట్టాలి
సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దయ్యాల నరసింహ
గ్రామాల్లో దేవాలయాలు ఎక్కడ సిసి రోడ్డు పనులు చేపట్టిన నాణ్యతతో చేపట్టాలని, అధికారులు ఒత్తిళ్లకు తలకి పనులలో రాజీ పడవద్దు అన్నారు. సిసి రోడ్డు పనులు వేస్తే సంవత్సరాలకు ఉండవలసిన సిసి రోడ్ కేవలం 10, 20 రోజుల వ్యవధిలోనే పగుళ్లు పట్టడం వలన నాణ్యత గా పనులు చేపట్ట లేదనే విషయం అర్థం అవుతుందన్నారు.