Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-చివ్వెంల
గొర్రెల పెంపకంతో ఆర్థిక పరిపుష్టి కలుగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.తద్వారా ఎగువ రాష్ట్రాల నుండి దిగుమతి అవుతున్న మాంసం ఉత్పత్తులు నిలువరించడం సులభతరమౌతుందన్నారు.అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా గొర్రెల పెంపకాన్ని ప్రోత్సాహిస్తున్నారన్నారు.వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకుగాను ఆయన శుక్రవారం నియోజకవర్గంలో తుంగతుర్తి, భువనగిరి ఎమ్మెల్యేలు గాదరికిశోర్‌కుమార్, పైళ్ల శేఖర్‌రెడ్డిలతో కలిసి పర్యటిస్తున్న క్రమంలో మండలంలోని ఐలాపురం వద్ద రోడ్డు దాటుతున్న గొర్రెల మందను చూసి తన కాన్వారుని ఆపారు.కారు దిగి గొర్రెపిల్లను చేతిలోకి తీసుకుని గొర్రెల కాపరితో కాసేపు ముచ్చటించారు.అనుకోకుండా తారసపడిన ఈ ఉదంతాన్ని ఎదుర్కొన్న గొర్రెల కాపరి అవాక్కయ్యాడు.కాసేపటికి తేరుకొని అభివృద్ధి కార్యక్రమాలు అమలు పరుస్తూ సంక్షేమ పథకాలను లబ్దిదారులకు చేర వేసే మంత్రి జగదీశ్‌రెడ్డి ఎదురుగా ప్రత్యక్షం కావడం ఒక ఎత్తైతే అమాంతం గొర్రె పిల్లను చేతిలోకి తీసుకొని గొర్రెలలో రకాలు, వాటి పెంపకం విధానం చెబుతుంటే ఆశ్చర్యపోవడం సదరు గొర్రెల కాపరి వంతైంది. వ్యవసాయమన్నా, ఆవులు,బర్రెలు,గొర్రెల పెంపకం అంటే అమితంగా ఇష్టపడే మంత్రి గొర్రెల పెంపకంలో మెళుకవులు చెబుతుంటే గొర్రెల కాపరి అమితాశక్తితో వినడం ఈ పర్యటన లో హైలెట్‌గా నిలిచింది.