Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్
నవతెలంగాణ-చివ్వెంల
గృహలక్ష్మీ పథకంలో వికలాంగుల ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షల నుండి రూ.15 లక్షల వరకు దళితబంధు తరహాలోనే వికలాంగుల బంధు పథకాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు కల్పించేంతవరకు ప్రభుత్వం పై తమ పోరాటం ఆగదని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ అన్నారు. కొండలరాయినిగూడెంలో సంఘం జిల్లా నాయకుడు వడ్డేపల్లి విజయకుమార్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మించేందుకు తీసుకువస్తున్న గృహలక్ష్మీ పథకం కింద ఆసరా పింఛన్ వచ్చే ప్రతి వికలాంగునికి రూ.10 లక్షలతో ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.రాష్ట్రంలో దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగుల సమాజం అభ్యున్నతి కోసం దళితబంధు తరహాలోనే రూ.15 లక్షలతో వికలాంగుల బంధు పథకాన్ని తీసుకువచ్చి వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగుల సమాజానికి పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.వారికి మున్సిపాలిటీ, మండలపరిషత్, గ్రామపంచాయతీల్లో కోఆప్షన్ సభ్యులుగా నియమించాలని కోరారు.వారికి ఆత్మగౌరవం, రాజ్యాధికారం సాధనే ధ్యేయంగా ప్రభుత్వాలపై తమ పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు వడ్డేపల్లి విజరుకుమార్, సామేలు, వడ్డేపల్లిధనమ్మ, వడ్డేపల్లి మారతమ్మ, వేదాసు ప్రేమలత, శ్రీను తదితరులు పాల్గోన్నారు.