Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరపత్రాలు పంచి ప్రచారం
నవతెలంగాణ-మిర్యాలగూడ
బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5న చేపట్టే చలో ఢిల్లీని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్ కోరారు. శుక్రవారం స్థానిక పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ అడ్డా వద్ద కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, వాటిని తిప్పుకొట్టేందుకు భవిష్యత్తులో బలమైన ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ మతోన్మాద అనుకూల విధానాలను ప్రతిఘటించాలన్నారు. కార్మికుల హక్కులు, కార్మిక చట్టాల రక్షణ, నాలుగు లేబర్ కోడ్ల రద్దు, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీ దినం కనీస వేతనం 600 రూపాయలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. రైతు పండించిన అన్ని ఉత్పత్తులకు కనీసం మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు గ్యారెంటీ చేయాలని, ఒకేసారి కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేసి 60 ఏండ్లు పైబడిన రైతులందరికీ పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తృతం చేయాలని డిమాండ్లతో 10 లక్షల మందితో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, భవనిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బీఎం. నాయుడు, పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మంద సైదులు, ఎస్పీ సైదులు, నాగుల్ మీరా, గోవర్ధన్‌రెడ్డి, రామారావు, కుసుములు తదితరులు పాల్గొన్నారు.
బాపూజీ నగర్లో...
కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5న చేపట్టే చలో ఢిల్లీని జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి కోరారు. శుక్రవారం పట్టణంలోని బాపూజీ నగర్ ఏడో వార్డులో కరపత్రాల ద్వారా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టౌన్ కమిటీ సభ్యులు ఎస్. వెంకటేశ్వర్లు, శాఖ కార్యదర్శి ఆర్.శివరాజు, లక్ష్మణ్ రాజు, ఇన్నయ్య, కృష్ణ, అంజన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
చండూర్ : దేశంలో బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించడానికే ఏప్రిల్ 5న చలో ఢిల్లీ నిర్వహిస్తున్నామని, ఈ చలో ఢిల్లీకి రైతాంగం, కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం పిలుపునిచ్చారు. శుక్రవారం గట్టుప్పల మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) ప్రజాసంఘాల జంగల్పాడులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు చాపల మారయ్య, కర్నాటి మల్లేశ్, బొట్టు శివకుమార్, ఖమ్మం రాములు, పరసనబోయిన యాదగిరి, ఖమ్మం రాములు, కర్నాటి సుధాకర్, ఎండీ. రబ్బాని, వల్లూరి శ్రీశైలం, నరసింహ, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.