Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాను మొదటి స్థానంలో నిలిపేలా పనులు జరగాలి
- ఉపాధి హామీ పనుల సమీక్షా సమావేశంలో కలెక్టర్
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
మండల స్థాయి అధికారులు అలసత్వం వీడి బాధ్యతతో పని చేయాలని, గ్రామీణ వ్యవస్థలో ప్రభావ వంతంగా మార్పు సాధించేందుకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ టీ. వినరు కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం టీటీడీసీలో ఎంపీడీిఓలు, ఎంపీఓలు, ఏపీడీలు, డీఎల్పీఓలు, ఎపీఓ లతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో లేబర్ మొబిలైజేషన్, పనుల గుర్తింపు, షెల్ఫ్ ఆఫ్ వర్క్స్, గ్రామ పంచాయతీ ట్యాంకర్ల వినియోగం, నర్సరీలు, మొక్కల నిర్వహణ తదితర అంశాలపై కలెక్టర్ మండలాల వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రగతిలో రాష్ట్రంలో జిల్లాను ముందు స్థానంలో నిలిచేలా సమన్వయంతో టీమ్ లాగా పని చేయాలన్నారు. లేబర్ టర్మోవర్ చాలా మండలంలు, గ్రామాల్లో తగ్గుతూ వస్తోందని, వారం రోజుల్లో ఆయా గ్రామాల వారీగా లేబర్ రిపోర్ట్ పరిశీలిస్తూ కలెక్టర్ సమీక్షించారు. నల్లగొండ జిల్లాలో గ్రామీణ ప్రాంతం ఎక్కువగా వుందని, ఎక్కువ మంది కూలీల పేర్లు నమోదయ్యేలా చూడాలని, వ్యవసాయ పనులు తగ్గుతున్నందున ప్రతీ గ్రామంలో ఎక్కువ మంది కూలీలకు పని కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ముందుగా పంచాయితీ రాజ్ ఈఈలు, డిప్యూటీ ఈఈలు, ఏఈలతో ఉపాధి హామీ కింద సీసీ రోడ్లు, మన ఊరు మన బడి క్రింద పాఠశాలలలో కిచెన్ షెడ్లు, ప్రహరీ గోడలు, శౌచాలయాల వంటి నిర్మాణాలు చేపట్టి ఖర్చును జెనెరేట్ చేస్తూ ఎఫ్టీఓలో వివరాలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఇంజనీర్లకు సూచించారు. పనులు చేపట్టి రికార్డ్స్ నమోదు చేయాలని, మెటీరియల్ కంపోనేంట్ కోసం సిద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు. పాఠశాలల్లో పెయింటింగ్ పనులను త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూగుప్తా, జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరణ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.