Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి జగదీశ్‌రెడ్డికి టీడబ్ల్యూజేఎఫ్ వినతి
నవతెలంగాణ-మిర్యాలగూడ
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మంత్రి జగదీశ్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. మండలంలోని కొత్తగూడెంలో జరిగిన ఓ కార్యక్రమానికి మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరు కాగా అక్కడ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండస్థలాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజా సేవలో నిమజ్జమైన జర్నలిస్టులు అదే ఇండ్లు నివసిస్తున్నారని, అద్దెలు కట్టలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అనేకమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించామని అయినా నేటికీ సమస్య పరిష్కారం కాలేదని వినతిలో పేర్కొన్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసిందని, అందులో భాగంగా మిర్యాలగూడలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇండ్లస్థలాలు కేటాయించాలని కోరారు. ఆ విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు ఖాజా హామిదోద్దీన్, జిల్లా అధ్యక్షులు ఆయూబ్, రాష్ట్ర కమిటి సభ్యులు జీ. వెంకన్న, నియోజకవర్గ అధ్యక్షులు మంద సైదులు, మహేష్, నాగరాజు, హరీష్, యాదగిరి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.