Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
గ్రామంలో నెలకొని ఉన్న పారిశుద్ధ్య సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎంపీపీ బాచుపల్లి శ్రీదేవి గంగాధర్‌రావు కోరారు. శుక్రవారం మండలంలోని చందుపట్ల గ్రామంలోని వివిధ వార్డులలో పర్యటించి నెలకొని ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్యం దుర్భరంగా ఉందని, వెంటనే పారిశుద్ధ్యంపై దృష్టి కేంద్రీకరించాలని గ్రామ కార్యదర్శికి సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ప్రతిభను పరిశీలించి వసతి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుని పోస్టు ఖాళీగా ఉందని ఆ పోస్టును భర్తీ చేసే విధంగా చూడాలని ఉపాధ్యాయ బృందం ఎంపీపీకి విన్నవించారు. ఆమె వెంట స్థానికులు బెజవాడ లక్ష్మీనారాయణ, కోటగిరి రాధాకృష్ణ, జిల్లా ప్రవీణ్, జిల్లాసంపత్, తాడ్వాయి శేఖర్, ఎర్ర దయాకర్, పుట్ట గోపాల్, పుట్టరాజు, కోటగిరి నాగరాజు, పుట్ట సందీప్,పంది సాగర్, నర్సింగ్ నరేష్,కొప్పు సందీప్, పెద్ది సందీప్, కొల్లు వివేక్, నర్సింగ్ నవీన్, బుడిగ మహేష్, రాచూరి వెంకన్న,గంగుల సైదులు, శివ, సంపత్, చరణ్, పరుశురాం ఉన్నారు.