Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో పేరెంట్స్ మీట్
నవతెలంగాణ-మిర్యాలగూడ
విద్యార్థుల కోరికలను గుర్తించి వారి ఆసక్తి మేరకు ప్రోత్సహించాలని మానసిక వేత్త జార్జి అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని లిటిల్‌ఫ్లవర్ పాఠశాల పేరెంట్స్ మీట్ నూకల వెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ వేడుకలో వక్తలు జార్జి, గోపి, సాయి ప్రమోద్‌లు పాల్గొని మాట్లాడారు. విద్యార్థులను సెల్ ఫోన్లకు దూరం ఉంచాలని, వారి కోర్కెలు గుర్తించి వాటి అవసరం ఉపయోగం వివరించి వాటిని అందించాలని పేర్కొన్నారు. పిల్లలను తక్కువ చేసి మాట్లాడకుండా వారి ఆసక్తి మేరకు ప్రోత్సహించాలని కోరారు. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా పిల్లలతో ఎక్కువసేపు సరదాగా గడిపేందుకు ప్రయత్నం చేయాలన్నారు. తమకున్న ఒత్తిడిలను పిల్లల ముందు ప్రదర్శించకుండా వారితో సరదాగా గడపి వారి అభిరుచులను గుర్తించాలన్నారు. ముఖ్యంగా మంచి చెడులను వారికి అర్థమయ్యే రీతిలో వివరించాలని సూచించారు. పిల్లలు పుస్తకాలు ఎక్కువగా చదివే విధంగా ప్రోత్సహించాలన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు జయరాజు, రామన్ తదితరులు పాల్గొన్నారు.