Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూర్యాపేట జిల్లాలో మైనార్టీ రుణాల దరఖాస్తులు 3126
- మండలానికి1, 2 యూనిట్లు మాత్రమే కేటాయింపు
- లక్ష, రెండు లక్షల యూనిట్లుగా మంజూరు
- జిల్లావ్యాప్తంగా లక్ష రూపాయల రుణంలో 69
- రెండు లక్షల యూనిట్లో 69
- కేటాయింపుమండలాల్లో ఎంపీడీవోల లాగిన్‌లో పెండింగ్
- అర్హులందరికీ రుణాలివ్వాలని లబ్దిదారుల విన్నపం
ముస్లిం మైనారిటీ రుణాల్లో ఏడాదికి కోత పెడుతుండటంతో లబ్దిదారులు ఆవేదనకు గురువుతున్నారు. చదువుకు తగ్గ ఉద్యోగాలు కల్పించకపోగా.ఉపాధి లేక చిరువ్యాపారం చేసుకుందామంటే రుణాలు అందడం లేదని వాపోతున్నారు.ఒక్కో మండలంలో వందలాది మంది రుణాల కోసం దరఖాస్తులు చేసుకుంటే కేవలం ఒకటి రెండు యూనిట్లు మాత్రమే కేటాయిస్తుండటంతో మిగిలిన వారికి నిరాశ తప్పడం లేదు. యూనిట్లతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకున్నవారందరికీ రుణాలు ఇవ్వాలని కోరుతున్నారు. ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం ఎన్నో చేస్తున్నామని చెబుతున్నా ఒక్కొక్క మండలానికి నలుగురు, ఐదుగురికి మాత్రమే సబ్సిడీతో కూడిన రుణాలను అందజేయనున్నారు.
నవతెలంగాణ -సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలోని అన్నిమండలాల్లోనూ గత నెల జనవరి ఐదో తేదీ వరకు మైనార్టీ రుణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.మైనారిటీ కార్పొరేషన్ నుండి రుణాలను పొందాలని ఎన్నో ఏండ్ల నుండి ఆశలతో ఉన్న ముస్లిం మైనారిటీలు హడావిడి చేసి మీ సేవ కేంద్రాల నుండి ఆదాయం సర్టిఫికెట్లను పొంది దరఖాస్తులను చేసుకున్నారు.
లక్ష, రెండు లక్షల యూనిట్లుగా మంజూరు.
లక్ష రూపాయల రుణానికి 80 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనుండగా.20 శాతం బ్యాంకులు లేక స్వతహాగా డబ్బులు బ్యాంకులతో నిమిత్తం లేకుండా చెల్లించుకునే వెసులుబాటు కల్పించారు.2 లక్షల రుణానికి 70 శాతం ప్రభుత్వ సబ్సిడీ మిగతా 30 శాతం బ్యాంకుకుసంబంధం లేకుండా కార్పొరేషన్ చెల్లిస్తే లక్ష, రెండు లక్షల చెక్కును అందజేయనున్నారు.ఇంత వరకు బాగా ఉన్నా,రుణాల కేటాయింపు పట్ల లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒక్కో మండలానికి 6 మూడు నుంచి నాలుగు మాత్రమే కేటాయిస్తుండటంతో మిగతా వారికి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
జిల్లాలోని హుజూర్ నగర్ నియోజ కవర్గంలో తొమ్మిది మండలాల్లోని గరిడేపల్లి 93, నేరేడుచర్ల 33, పాలకీడు 73, మట్టపల్లి 44, హుజూర్ నగర్ 78, చింతలపాలెం 68, మేళ్లచెరువు 67, హుజూర్నగర్ అర్బన్ 39, నేరేడుచర్ల అర్బన్ 49, మంది ముస్లిం మైనారిటీలు రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు.
కోదాడ నియోజకవర్గంలో ఏడు మండలాలలోని కోదాడ 190, కోదాడ అర్బన్ 500, మునగాల 141, చిలుకూరు 96, నడిగూడెం 133, మోతే 37, అనంతగిరి 47 మంది ముస్లింలు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో ఐదు మండలాల్లో సూర్యాపేట 230, ఆత్మకూర్ (ఎస్) 53, చివ్వెంల 121, పెన్ పహాడ్ 45, సూర్యాపేట అర్బన్ 299 మంది ముస్లిం మైనార్టీలు దరఖాస్తు చేసుకున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాలలో నాగారం 45, తిరుమలగిరి 46, తిరుమలగిరి అర్బన్ 40, తుంగతుర్తి 68, మద్దిరాల 31, నూతనకల్ 12, జాజిరెడ్డిగూడెం 24, మంది ముస్లిం మైనార్టీలు దరఖాస్తులు చేసుకోగా ఇందులో ఎంపీడీవోల లాగిన్ లో పెండింగ్ ఉన్నాయి. కొన్ని మున్సిపాల్టీ పరిధిలో పెండింగ్‌లో ఉన్నాయి. వెంటనే వాటిని పరిశీలించి ముస్లిం మైనారిటీలకు రుణాలు అందజేయాలని ముస్లిమ్స్ మైనారిటీలు కోరుతున్నారు.
జిల్లాలోని 28 మండలల్లో మొత్తం 3126 మంది నిరుద్యోగులు వ్యాపారం చేసుకోవడానికి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. కానీ రుణాలు మాత్రం 100 నుంచి 138 మందికి అందనున్నాయి.ప్రభుత్వాల ద్వారా వచ్చే సబ్సిడీ రుణాలు తీసుకొని చిరు వ్యాపారం పెట్టుకొని కుటుంబాలను పోషించుకుందామనుకుంటే కేవలం నలుగురైదుగురికి రుణాలు కేటాయిస్తూ చేతులు దులుపుకుంటున్నారని వాపోతున్నారు. ఏన్నో అశాలతో దరఖాస్తులు చేసుకుంటే సబ్సిడీ రుణాలు అందని ద్రాక్ష గానే మిగిలిపోతున్నాయని కుమిలిపోతున్నారు. తమకు బ్యాంకులు అనేక కొర్రీలు పెడుతున్నాయని ముస్లిం మైనార్టీలను ఓటు బ్యాంకుగా చూడకుండా దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను గుర్తించి అందరికీ రుణాలు ఇవ్వాలని ముస్లింలు కోరుతున్నారు.
త్వరలోనే రుణాలు అందజేస్తాం
జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి.విజయేందర్ రెడ్డి
జిల్లాలో ముస్లిం మైనార్టీ సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులని గుర్తించి రుణాలు మంజూరు చేస్తాం. ముస్లిం మైనార్టీ రుణాల కోసం జిల్లా వ్యాప్తంగా 3126 దరఖాస్తు చేసుకోగా అందులో లక్ష రూపాయలు యూనిట్ కు 69, రెండు లక్షల రూపాయల రుణం కోసం 69 మందిని అర్హులుగా గుర్తించాం. త్వరలోనే వారికి రుణాలు అందజేయన్నాం.