Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ -భువనగిరిరూరల్
అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ప్రశ్నా పత్రాల లీకేజీలో టీఎస్పీఎస్సీ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ డిమాండ్‌చేశారు. శుక్రవారం ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాదిమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆశతో ఎదురుచూస్తున్నారన్నారు. హాస్టల్లో ఉంటూ కోచింగ్‌లకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ నానా ఇబ్బందులు పడ్డ నిరుద్యోగులకు ఈ ఘటన తీవ్ర నష్టదాయకమని ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ మనస్తాపం కలిగించిందని పేర్కొన్నారు. విచారణ కోసం ఏర్పాటు చేయబడ్డ సిట్ ఎనిమిది మంది నిందితులను రిమాండ్‌కు పంపడంతోనే సరిపెట్టకుండా నియామకాల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీఎస్పీఎస్సీ చైర్మెన్‌్, కార్యదర్శి, మొత్తం సభ్యులపై చర్యలు తీసుకోవాలని, పేపర్ల పరీక్షలను రద్దుచేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కోరారు. పేపర్ లీకేజీలో టీఎస్పీఎస్సీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. డిపార్ట్మెంట్ వ్యవహారాలు, పరీక్ష పేపర్లు, కీలకమైన పాస్వర్డ్డ్ కమిషన్ లేదా చైర్మెన్, సెక్రెటరీలకు మాత్రమే తెలుస్తాయని వివరించారు. రహస్య విభాగంలోకి ఇతర సెక్షన్ అవుట్సోర్సింగ్్ ఉద్యోగులు ఎలా ప్రవేశించారో చెప్పాలని డిమాండ్ చేశారు. యూజర్ ఐడీ , పాస్వర్డ్డ్లు వారి చేతికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇప్పటికే గ్రూప్-1 పరీక్ష పేపర్లు కూడా లీక్ అయినట్టుగా వస్తున్న వార్తలపై టీఎస్పీఎస్సీ పూర్తి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడ్డ నిందితులను ఎంతటి వారైనా కఠినంగా శిక్షించి ,ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.