Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురవడంతో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా చల్లబడ్డది.పలుచోట్ల విద్యుత్ సరాఫరాకు అంతరాయం కలిగింది.భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.జిల్లాలో మూడు రోజుల పాటు నామమాత్రంగా చిరుజల్లులు కురిశాయి.జిల్లా కేంద్రంమైన భువనగిరిలోని లోతట్టు ప్రాంతాల్లో నీరొచ్చి చేరింది.
ఆలేరుటౌన్ : మండలకేంద్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది ఈదురుగాలులతో మెరుపులతో విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది.ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కారణంగా పట్టణ ప్రజలు ఇండ్లకు పరిమితమయ్యారు.సీసీ రోడ్లన్నీ జలమయమయ్యాయి. పట్టణంలోని మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా వర్షం నీరు నిలిచింది. విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో ఇంటర్మీడియట్ విద్యార్థులకు, పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఇబ్బంది తలెత్తింది. వర్షానికి ఈదురుగాలులకు చేతికొచ్చిన పంటలు దెబ్బతింటాయని రైతులు వాపోయారు. ఈదురుగాల వర్షానికి మామిడి తోటల్లో మామిడికాయలు రాలి పోయాయి.