Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామన్నపేట
మహిళలు అందరూ చైతన్యవంతులై మహిళా సాధికారత సాధించడానికి కృషి చేయాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి అన్నారు.సుమధుర ఫౌండేషన్ సహాకారంతో, హ్యాండ్ ఇన్యండ్ ఇండియా నిర్వహణలో మండలంలోని ఇస్కిల్లా గ్రామంలోని కమ్యూనిటీహాల్లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండి, స్వీయ అభివృద్ధి చెంది, స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారాన్ని తెలుసుకొని అర్హులు సద్వినియోగ పరుచుకోవాలని కోరారు. మహిళలు ఆత్మగౌరవంగా ఉండి, ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఉండి ఎదురయ్యే సమస్యలను, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాలని, సరైన ఆహారపు అలవాట్లు అలవర్చుకొని పోషకాహారాన్ని తీసుకొని, ఆరోగ్యంగా ఉండాలన్నారు.చిన్నారులు, మహిళలు లైంగిక దాడులను, భౌతిక దాడులను ధైర్యంగా ప్రతిఘటించి, జీవితంలో ముందుకు వెళ్ళాలని, మహిళలు, చిన్నారుల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాల్ సెంటరున్ ను తెలుసుకోవాలన్నారు. సఖి సెంటర్ సేవలను వివరించారు. మహిళలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా ముందుకు వెళ్ళాలని, విద్య, ఉపాధి అవకాశాలను సద్వినియోగ పర్చుకోవాలన్నారు. సుమధుర ఫౌండేషన్ ముఖ్య అధికారి జీవన మాట్లాడుతూ గ్రామంలో ఏర్పాటు చేసిన వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలను సద్వినియోగ పర్చుకోవాలని, త్వరలో అనేక సమాజహిత కార్యక్రమాలు చేపట్టి మహిళా చైతన్యం, మహళా సాధికారతకు కృషి చేయనున్నట్లు తెలిపారు. హ్యాండ్ ఇన్ హ్యాండ్ నిర్వాహాకులు జాన్ క్రిష్టోఫర్ మాట్లాడుతూ ఈ సేవలను చుట్టు ప్రక్కల ఉన్న 5 గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాలలోని మహిళలు సద్వినియోగ పర్చుకొని, ఉపాధి పొంది స్వయం ఉపాధిని పెంపొందింప జేసేలా కుట్టు శిక్షణ, మగ్గం వర్క్, కంప్యూటర్ కోర్సు లో శిక్షణను అందిస్తున్నామని, (ట్రైలరింగ్) విభాగంలో శిక్షణ పొందిన వారికి స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేలా వారికి ఉపాధి పొందేలా కృషి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరిక్టర్ శైలజ, సూపర్వైజర్ హేమలత,సర్పంచ్ బందెల యాదయ్య, సుమధుర ఫౌండేషన్ మేనేజర్ విజరు, పోస్టాఫీస్ బ్రాంచి మేనేజర్ శివప్రసాద్, ఇస్కిళ్ల గ్రామ పంచాయతీ సెక్రెటరీ స్వరూప, జనంపల్లి సెక్రెటరీ రమాదేవి, ఇస్కిళ్ల ఉపసర్పంచ్ యాదిరెడ్డి, హ్యాండ్ ఇన్హ్యాండ్ నిర్వాహాకులు మేనేజర్ కిషోర్ పాట్నా, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ప్రశాంతిరెడ్డి, రాజేందర్, కల్పన, మారో ండేయ, మహిళాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.