Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్రూరల్
ప్రజలు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నార్కట్పల్లి డిపో అసిస్టెంట్ మేనేజర్ ఎం.వెంకటమ్మ అన్నారు.మండలంలోని జైకేసారం గ్రామంలో వికలాంగులకు రాయితీ బస్సుపాస్లపై బస్సుపాస్ మేళాలో అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.వికలాంగులకు 50 శాతం రాయితీ ఇవ్వడం జరగుతుందన్నారు. ప్రజలు శుభకార్యాలకు,ఇతర అవసరాలకు ఆర్టీసీ బస్సులను వాడుకోవాలని కోరారు. జై కెసారం గ్రామంలో 20 మందికి బస్సుపాస్లు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో బస్సుపాస్ మేళా ఇన్చార్జి రామచంద్రం, సర్పంచ్ కొర్పూరి సైదులు,వార్డు సభ్యులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.