Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-భువనగిరి
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టిస్తానని తొమ్మిదేండ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టని ప్రభుత్వం కేసీఆర్‌దని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభంఅనిల్కుమార్రెడ్డి అన్నారు.శనివారం హాత్ సే హాత్ జోడోయాత్రలో భాగంగా పట్టణంలో పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిములకు 12 రిజర్వేషన్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసంచేసిందన్నారు.స్థానిక ఎమ్మేల్యే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ఒక్క మాట కూడా మాట్లాడడని ఎద్దేవా చేశారు.కొత్త రేషన్ కార్డు ఇంతవరకు ఇయ్యలేదన్నారు. ఎలక్షన్లు వచ్చినప్పుడే ప్రజలు ఎమ్మెల్యే పైళ్ శేఖర్ రెడ్డికి గుర్తు కు వస్తాయన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఇండ్లు, ఇండ్లస్థలాలు, ఇంటి రుణాలు ఇచ్చామన్నారు. అర్హలైన వారందరికీ డబల్ బెడ్ రూం కట్టించాలన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నజీమసలావుద్దిన్,మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ పోత్నక్ ప్రమోద్‌కుమార్,మాజీ మున్సిపల్ చైర్మెన్ బర్రెజహంగీర్,టీపీసీసీ సభ్యులు తంగెల్లపల్లి రవికుమార్, పట్టణ అధ్యక్షులు బీసుకుంట్ల సత్యనారాయణ, కూర వెంకటేష్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.