Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో వినియోగదారుల సంక్షేమ చట్టం, వ్యవసాయ దారులకు ఆర్థికసహాయం, రుణాలపై ఆర్బీఐ వారు ఇచ్చిన మార్గదర్శక సూత్రాలపై న్యాయ విజ్ఞాన సదస్సును కోర్టు ఆవరణలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె.మారుతిదేవి విని యోగదారుల సంక్షేమచట్టాలు, వ్యవసాయదారులకు ఆర్థిక చేయూత నిచ్చే ఆర్బీఐ మార్గదర్శకసూత్రాలను వివరించారు. విత్తనాలను కొనుగోలు చేయటములో నాణ్యత చూసి కొనుగోలు రశీదు పొందాలన్నారు.ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి డి.నాగేశ్వర్రావు వినియోగదారుల సంక్షేమనికై చట్టం రూపొందించ బడిందన్నారు.దీనిని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపి, ప్రతిఒక్కరూ రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని తెలిపారు.యాదాద్రి జిల్లా వినియోగదారుల సంక్షేమ సంఘం కార్యదర్శి జె.అంజయ్య మాట్లాడుతూ ప్రతి వినియోగదారుడు వస్తువు కొనుగోలుపై శ్రద్ధ వహించి నాణ్యత లోపాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ సంక్షేమ సంఘం ద్వారా ప్రతి ఒక్కర్ని చైతన్య రిచే దిశగా కృషి చేస్తున్నామన్నారు.అనంతరం బ్యాంకు లోక్ అదాలాత్ను నిర్వహించి యూబీఐ బ్యాంకు చెందిన 23 ఫ్రీలిటిగెషన్ కేసులకు పరిష్కరించి దాదాపు రూ.2,23,000 బకాయిదారుల నుండి రాజీపూర్వక పరిష్కారం ద్వారా పరిష్కరించారు.ఈ కార్యాక్రమంలో యూబీఐ చీఫ్ మేనేజర్ ఉత్పల్కుమార్, మేనేజర్భరత్, భువనగిరి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు బి.కేశవరెడ్డి, ప్రభుత్వ న్యాయవాది ఎన్.అంజయ్య, లోక్అదాలాత్ సభ్యులు జి.నాగేంద్రమ్మ, బాలేశ్వర్ పాల్గొన్నారు.