Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జహంగీర్
నవతెలంగాణ-భువనగిరి
సంక్షేమం,మతసామరస్యం,ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జనచైతన్య యాత్ర చేపడుతున్నామని,ఈ యాత్రను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండిజహంగీర్ పిలుపునిచ్చారు.శనివారం జిల్లాకేంద్రంలోని సుందరయ్యభవన్లో యాత్రకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.కేంద్రంలోని బీజేపీ అవలంబిస్తున్న మతోన్మాద కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ యాత్ర దోహదపడుతుందన్నారు.సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతులు చేయడానికి ఈ యాత్రలు చేపడుతున్నామన్నారు. బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాదాన్ని,కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న ప్రజా సంపదను ప్రజలకు వివరించి చైతన్యపరుస్తామన్నారు.దేశంలో ఒకే మతం,ఒకే కులం,ఒకే పార్టీ,ఒకే విధానం ఉండాలని మోడీ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.అందులో భాగంగానే ప్రజల మధ్య చిచ్చుపెడుతూ రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారనానరు.తమ మాట వినని రాజకీయ నాయకులను ఈడీ,సీబీఐల పేరిట దాడులు చేయించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకొస్తే అరాచక పాలన సాగు తుందన్నారు.అందుకే ఆ పార్టీ అడ్డ్డుకునేందుకే కమ్యూనిస్టు పార్టీలు ఐక్య ఉద్యమాలు చేస్తున్నాయని తెలిపారు.బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల కాలంలో నిత్యావసర ధరలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజలు బతకలేనంత పరిస్థితి తీసుకొచ్చిందన్నారు.ఇలాంటి ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు.రాష్ట్రంలో ఈనెల 17న ప్రారంభమైన ఈ యాత్రలు మూడు ప్రాంతాల నుంచి చేపడుతున్నట్టు ప్రకటించారు.23న ప్రారంభం అయ్యే యాత్ర 28 న భువనగిరి జిల్లాకేంద్రానికి చేరుకుంటుందన్నారు.ఈ సందర్భంగా జరిగే బహిరంగసభను ,ఈ యాత్రను అన్ని వర్గాల ప్రజలు ఆదరించే జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేశ్, నాయకులు ఈర్లపల్లి ముత్యాలు, వనంరాజు,వడ్డెబోయినవెంకటేష్, పోకలదయానంద్, వెంకటయ్య, కవిత, వెంకటమ్మ, పాల్గొన్నారు.