Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేశ్‌రెడ్డి
నవతెలంగాణ-పెన్‌పహాడ్
కుల, మత, జాతి, ప్రాంతం పేర్లతో మనుషుల మధ్య బీజేపీ విభేదాలు సృష్టిస్తుందని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డి విమర్శించారు. హత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా గత 28 రోజులుగా నిర్వహిస్తున్న పాదయాత్ర 29వ రోజు శనివారం చివ్వేంల మండలం గుంజలూరు నుండి ప్రారంభించి మండలం భాగ్యతండ నుండి రంగయ్యగూడెం, భక్తాలపురం గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు డప్పులు, కోలాటాలతో ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలను దోచి అదాని, అంబానిలకు పెడుతుందని, పెంచిన పెట్రోల్, గ్యాస్ ధరలతో సామాన్యుడిపై తీవ్ర భారం పడిందన్నారు. మన నీళ్లు, మన ఉద్యోగాలనే మాయమాటలతో గద్దెనెక్కిన కేసిఆర్, జగదీశ్‌రెడ్డిల కుటుంబాలు బంగారుమయం అయ్యాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు కొండేటి పవన్, గద్దల నాగరాజు, జిల్లా నాయకులు బచ్చుపల్లి నాగేశ్వరరావు, యాట ఉపేందర్, కుందూరు వెంకటరెడ్డి, స్వామి నాయుడు, బెల్లంకొండ శ్రీరాములు, మండలి పిచ్చయ్య, షఫీవుల్ల, నామ ప్రవీణ్, షేక్ ఫరూక్, నూనావత్ సైదులు, చింతం వెంకటేశ్వర్లు, నర్సిరెడ్డి, సురభి వెంకటేశ్వర్లు, తోగరు వెంకటేశ్వర్లు, నెమ్మాది ఉపేందర్, గడ్డయ్య, రమేష్ నాయుడు, హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.