Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
నవతెలంగాణ-కోదాడరూరల్
పేదలకు మెరుగైన వైద్యసేవలందించాలని శాసనసభ్యులు బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. శనివారం పట్టణంలోని హుజూర్నగర్ బైపాస్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన అరుణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి అరుణ మల్టీస్పెషల్టి హాస్పిటల్ ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉన్న కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో పేద, మధ్యతరగతి వర్గాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హాస్పిటల్ ఏర్పాటు చేయడం శుభసూచకమన్నారు. పుట్టిన ఊరులోనే వైద్య సేవలందించాలని, వైద్యశాలను ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ నిర్వాహకులు కొండ రాంబాబు, జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ గోపగాని వెంకట నారాయణగౌడ్, ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, కేఎల్ఎన్ ప్రసాద్, కారింగుల అంజి, కౌన్సిలర్లు కందుల చంద్రశేఖర్, బెజవాడ శ్రావణ్, మేదర లలిత, అలవాల అపర్ణ వెంకట్, ఖదీర్, వంటిపులి శ్రీనివాస్, సంపేట ఉపేందర్‌గౌడ్, గంధం పాండు తదితరులు పాల్గొన్నారు.