Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనింగ్ పర్మిషన్ గురించి నోరుమెదపని మట్టి వ్యాపారస్తులు
నవతెలంగాణ-కోదాడరూరల్
కొంతమంది కావాలని ఎమ్మెల్యే పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మట్టి వ్యాపారస్తులు అన్నారు. శనివారం పట్టణంలోని పబ్లిక్ క్లబ్లో మట్టి వ్యాపారులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో ఒక ట్రాక్టర్ ట్రక్కు మట్టి కిరాయి 1,500 రూపాయలు ఉండగా వేయి రూపాయలకు నిర్ణయించామని, అలాగే టిప్పర్ కిరాయి 5,000 ఉండగా 4,200 రూపాయలకు నిర్ణయించుకున్నామని తెలిపారు. మట్టి వ్యాపారం చేసే విషయంలో ఎమ్మెల్యే పై వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. తాము ఎవరికి ఎటువంటి కమిషన్ ఇవ్వడం లేదు అన్నారు. నిర్ణయించిన ధర కన్నా ఎక్కువ అమ్మితే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు అని తెలియజేశారు. కానీ మైనింగ్ పర్మిషన్‌పై కనీసం నోరు మెదపలేదు. ఈ కార్యక్రమంలో మట్టి వ్యాపారస్తులు నరేందర్, రామకృష్ణ, రాము, తదితరులు పాల్గొన్నారు.