Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కేంద్రంలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న జిల్లా ఆస్పత్రిని హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న 100 పడకల ఏరియా ఆస్పత్రికి ఇవ్వాలని ఈ ప్రాంత ప్రజలు, మేధావులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఉండటంతో అక్కడ ఉన్న ఆస్పత్రిని జిల్లా పరిధిలోని హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఆస్పత్రులకు తరలించే ఆవశ్యకత ప్రస్తుతం ఏర్పడింది. అయితే ప్రస్తుతం కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గం 30 పడకల ఆస్పత్రులు మాత్రమే ఉన్నవి. ఇటీవల కాలంలో తుంగతుర్తి ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా మార్చి ప్రభుత్వం 16 కోట్ల రూపాయలు ప్రభుత్వంమంజూరు చేసింది.అయితే గత 12 సంవత్సరాల క్రితం రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రపంచ బ్యాంకు నిధులతో హుజూర్‌నగర్‌లో ఉన్న 30 పడకల ఆస్పత్రి 100 పడకల ఆస్పత్రిగా ఏరియా ఆస్పత్రిగా మార్చారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న ఆస్పత్రిని తరలించాలంటే కనీసం 250 పడగల ఉన్న ఆస్పత్రికి తరలించాలి. ప్రస్తుతం ఉన్న 100 పడకల ఆస్పత్రిని 250 నుండి 300 పడకల ఆస్పత్రిగా మార్చి హుజూర్‌నగర్‌కు తరలించినట్లయితే ఈ ప్రాంతంలో వైద్య సౌకర్యాలు పెంపొంది ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రం పరిధిలో ఏడు మండలాలు ఉండగా మఠంపల్లి మేళ్లచెరువు మండలాల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు అత్యధికంగా ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలలో వేలాదిమంది కార్మికులు పనిచేస్తున్నారు. ఏదో ఒక పరిశ్రమలో ప్రమాదం సంభవించిన సమయంలో సకాలంలో వైద్యం అందక మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా హుజూర్నగర్ పట్టణంలో 10 రైసుమిల్లులకుపైగా ఉన్నాయి. వీటిలో కూడా వందలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. నగర్ కేంద్రంలో ఉన్న ఆసుపత్రి స్థాయిని పెంచినట్లయితే ఈ ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ ప్రాంత వాసులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆస్పత్రి ఇక్కడకు వచ్చినట్లయితే ఈ ప్రాంత వాసులకు మెరుగైన వైద్యం అందుతుంది. అన్ని రకాల వైద్య నిపుణులు డాక్టర్ల సిబ్బందిసంఖ్య పెరుగుతుంది. ఆస్పత్రిలో అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్‌ల వంటివి ప్రజలకు అందుబాటులో వస్తాయి. మెరుగైన వైద్యం అందుతుంది. స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న ఆస్పత్రిని హుజూర్ నగర్‌కు వచ్చే విధంగా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందేలా కృషి చేయాలని ఈ ప్రాంత వాసులు నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా అర్హతలు ఉన్నా హుజూర్‌నగర్‌కు రాజకీయాలకు అతీతంగా ఆస్పత్రికి 300 పడగల ఆస్పత్రికి కావలసిన నిధులను మంజూరు చేసి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంత వాసులకు వైద్య సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.