Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల గ్రామం, అనంతగిరి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామాలను కలెక్టర్ వెంకట్రావు శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగూడెం గ్రామంలో రోడ్ల వెంట పెంటదిబ్బలు, అస్తవ్యస్తంగా పారిశుధ్యం ఉండడంపై ఆయన అసహన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ లీకేజీలపై, గ్రామంలోకి నీరు సరఫరా కాకపోవడం పై సంబంధిత అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో మిషన్ భగీరథ అధికారులు ఎవరూ కూడా అందుబాటులోకి రాకపోవడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. తక్షణమే మరమ్మతులు చేపట్టి గ్రామస్తులకు నీటిని అందించాలని, పారిశుద్ధ్యం పనులు పూర్తి, కొత్తగూడెం నుండి గొండ్రియల వరకు నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. కలెక్టర్ గ్రామంలో పర్యటించిన సమయంలో గ్రామసర్పంచ్ ఎక్కడ కనిపించకపోవడం గమనార్హం. అదేవిధంగా చిమిర్యాల గ్రామంలో కార్యదర్శి సెలవులో ఉండటంతో సర్పంచ్ కొండ శైలజని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీవో కిషోర్ కుమార్, అనంతగిరిఎమ్మార్వో సంతోష్ కిరణ్, ఎంపీడీవో విజయ, పంచాయతీరాజ్ ఏఈ హర్ష, కార్యదర్శి వెంకటేష్ ,తదితరులు పాల్గొన్నారు.