Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ ఎస్.వెంకట్రావు
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్
యాసంగి 2022-23 సంవత్సరానికి గాను రైతులు పండించిన ధాన్యాన్ని ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, అలాగే సకాలంలో బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు.శనివారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఐకేపీ, మెప్మా,పీఏసీఎస్ కార్యదర్శి మిల్లర్ల యాజ మాన్యాలతో యాసంగి 2022 -23 వరి ధాన్యం కొనుగోలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. సగటు నాణ్యతా ప్రమాణాలు పాటించి తీసుకువచ్చిన ధాన్యాన్ని వ్యవసాయ క్షేత్రఅధికారులు పరిశీలన అనంతరం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మండల స్థాయిలో కొనుగోలు కమిటీ అధికారులుగా తహసీల్దార్లు వ్యవహరిస్తారని తెలిపారు. రైతుల నుండి కొనుగోలకేంద్రాలపై ఫిర్యాదులు అంది నట్టయితే,అట్టి వారిపై చర్యలు తీసుకోబడతాయని సూచించారు. ధాన్యం రవాణా కొరకు పూర్తిస్థాయిలో వాహనాల ఏర్పాటు, గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు తెలిపారు.కొనుగోలు పర్యవేక్షణకు మండల, డివిజన్, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. మండలాల వారీగా ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బంది గతంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల సమస్యల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకొన్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా వ్యవసాయ అధికారి డి.రామారావునాయక్ తెలిపారు.యాసంగి సీజన్లో రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసి రైస్ మిల్లల తోడ్పాటుతో జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్.మోహన్రావు, జిల్లా రైస్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ బి.రాంపతి,డీసీఓ శ్రీధర్,వ్యవసాయ అధికారి రామారావునాయక్, రైస్ మిల్లల అసోసియేషన్ యజమానులు, సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.