Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ
నవతెలంగాణ-భువనగిరి
వీరనారి మల్లు స్వరాజ్యం స్పూర్తితో ప్రభుత్వాలు అవలంభించే మహిళా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బట్చుపల్లి అనురాధ కోరారు. తెలంగాణ సాయుధ పోరాట యోదురాలు మల్లు స్వరాజ్యం ప్రథమ వర్థంతి ఐద్వా జిల్లా కమిటీి ఆద్వర్యంలో భువనగిరి పట్టణంలోని బాహార్పేటలో నిర్వహించారు.ఆమె చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించి మాట్లాడారు.భూమి,భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం అలుపెరుగని పోరాటం చేసి నైజా నిరంకుశ విధానాలను గెరిల్లా యుద్ధవ్యూహంతో పోరాడిన వీర వనిత స్వరాజ్యం అన్నారు.స్వాతంత్య్రానంతరం ప్రభుత్వాలు అవలంబించే విధానాలపై పోరాడి మహిళా హక్కుల కోసం చట్ట సభల్లో నినదించిందన్నారు.మహిళలకు బస్సుల్లో సీట్లు కావాలని,మద్యంకు వ్యతిరేకంగా లక్షలాది మహిళలను చైతన్యం చేసిందన్నారు.ఆమె స్ఫూర్తితో మహిళలు ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కల్లూరి నాగమణి, జిల్లా కమిటీ సభ్యురాలు దండు స్వరూప,పట్టణ నాయకురాలు ఆడెపులక్ష్మీ, దండులత, ధనలక్ష్మీ, సరిత, కవిత, భాగ్య,రేణుక, మౌనిక, ప్రీతి, ధరణి, యామిని,కమలమ్మ, పోచమ్మ, సత్తమ్మ, లక్ష్మీ, రేణుక పాల్గొన్నారు.
రామన్నపేట : తెలంగాణ వీర వనిత మల్లు స్వరాజ్యం స్పూర్తితో ప్రజా సమస్యలపై ప్రతి కమ్యూనిస్టు ఉద్యమించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మేక అశోక్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం ప్రథమ వర్థంతి సందర్బంగా స్థానిక పార్టీ మండల కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటి సభ్యులు వనం ఉపేందర్, మండల నాయకులు బోయిని ఆనంద్, వైస్ యంపిపి నాగటి ఉపేందర్, కల్లూరి నగేష్, కందుల హనుమంతు, గన్నెబోయిన విజయ భాస్కర్, గొరిగె సోములు, పెండెం బ్రహ్మయ్య, మేడి గణేష్, మేట్టు శ్రవణ్, అప్పం సురేందర్, ఎర్ర కాటమయ్య, రాపోలు ప్రభాకర్, శానగొండ వెంకటేశ్వర్లు, పల్లెసత్యం, వేముల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.