Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
ఆశావర్కర్లపై పని భారం తగ్గించడంతోపాటు కనీస వేతనం అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కల్లూరి మల్లేశం,కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం ఆశా యూనియన్ భువనగిరి మండల సమావేశం యూనియన్ అధ్యక్షురాలు పల్లెపాటి జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు.ఆశాలకు పారితోషికంతో సంబంధంలేని పనులు చేయించొద్దన్నారు.కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.మండల పీహెచ్సీలలో సమావేశాల పేరుతో, కంటి వెలుగు కార్యక్రమం పేరుతో నెలలో ఐదుసార్లు తిప్పుతున్నారన్నారు.కనీస ప్రయాణచార్జీలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.
సీఐటీయు అధ్వర్యంలో మల్లు స్వరాజ్యం ప్రథమవర్థంతి
సీఐటీయు అధ్వర్యంలో మల్లు స్వరాజ్యం ప్రథమ వర్థంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా కార్యదర్శి కే.లలిత, పీహెచ్సీ అధ్యక్షురాలు జ్యోతి, జిల్లా ఉపాధ్యక్షురాలు సంతోష, జిల్లా కోశాధికారి పుష్ప, నాయకులు ప్రమీల, అనిత, సౌభాగ్య, శోభ, మమత పాల్గొన్నారు.