Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్‌రెడ్డి
నవతెలంగాణ-రామన్నపేట
యాదాద్రిభువనగిరి జిల్లా వ్యాప్తంగా వడగండ్ల వానతో దెబ్బతిన్న వరి పంటకు దాన్యం రాలిపోయి నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్‌రెడ్డి కోరారు.రామన్నపేట మండలంలోని కొమ్మాయిగూడం, సిరిపురం, వెల్లంకి గ్రామల పరిసర ప్రాంతాల్లో ఆదివారం వడగండ్ల వానతో దెబ్బతిన్న వరి పంట చేల్లను, రాలిన వరిధాన్యాన్ని రైతు సంఘం ఆధ్వర్యంలో పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా నారాయణపురం, చౌటుప్పల్, వలిగొండ, పోచంపల్లి మండలాల్లో అకాలంగా కురిసిన వడగండ్ల వానతో రైతులు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. మూలిగె నక్కపై తాటిపండు అన్న చందంగా ఉందన్నారు.ఇప్పటికే వాతావరణం అనుకూలించక నట్టపిప్పి, ఇతర తెగులు సోకి ఒక్కో రైతు మూడు, నాల్గు సార్లు రసాయనాలు స్ప్రే చేసి ఆర్థికంగా నష్టపోయారన్నారు. ఇప్పుడిప్పుడే వరి చైన్లు తేరుకుంటుండగా అకాల వర్షంతో దాన్యం రాలిపోయి రైతులకు కన్నీరే దిక్కయిందన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం యుద్ధప్రాతిపతిపదికన స్పందించి వ్యవసాయ అధికారులను వ్యవసాయ క్షేత్రాలవద్దకు పంపించి, పంటనష్టాలను అంచనా వేయించి, ఎకరానికి 30 వేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీి సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, రైతుసంఘం మండల అధ్యక్ష,కార్యదర్శులు గన్నెబోయిన విజయభాస్కర్, బోయినిఆనంద్, నాయకులు ఎర్ర కాటమయ్య, శానగొండ వకటేశ్వర్లు, ఎర్ర రవిందర్, పొట్లచెర్వు నాగయ్య, ఆకిటి శ్రీను, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.