Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరి
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీకి నిరసనగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌రెడ్డి పిలుపుమేరకు భువనగిరి పట్టణంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్‌కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను ఆదుకుని కుటుంబానికో ఉద్యోగం ఇస్తానని చెప్పి ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖలాల్లేవన్నారు.దొంగ నాటకమాడి కావాలనే అభ్యర్థుల ద్వారా నుంచి లక్షలాది రూపాయలను ఫీజులుగా వసూలు చేసి జేబులో వేసుకున్నాడన్నారు.ఇప్పుడు తన అనుచర వర్గంతో నోటిఫికేషన్ ద్వారా ఇచ్చిన పరీక్ష పేపర్లను లీకేజీలు చేసి లక్షల రూపాయలు దండుకున్నాడని విమర్శించారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్‌కుమార్ మాట్లాడుతూ పేపర్ లీకేజీతో నిరుద్యోగుల అశలు ఆడియాశల య్యాయన్నారు.ఈ పాపం ఊరికే పోదని, ఇంతకు ఇంత కేసీఆర్ కుటుంబం అనుభవిస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు తంగెళ్లపల్లి రవికుమార్, పట్టణఅధ్యక్షులు బీసుకుంట్ల సత్యనారాయణ,కే.సొమయ్య, బాలరాజు పాల్గొన్నారు.