Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్‌నగర్‌టౌన్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా సెంటర్లో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జునరావు, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్నగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్, నాయకులు సామల శివారెడ్డి, కస్తాల శ్రావణ్ కుమార్, కుక్కడపు మహేష్ గౌడ్, బాచి మంచి గిరిబాబు, జక్కుల మల్లయ్య , సుంకర శివరాం యాదవ్, ఎడవల్లి వీరబాబు, తేజ వత్ రాజా నాయక్, కోతిసంపత్ రెడ్డి, గొట్టేముక్కల రాములు, చక్కెర వీరారెడ్డి మచ్చ వెంకటేశ్వర్లు, వెలిదండ వీరారెడ్డి, కారింగుల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
హుజూర్నగర్ : టీఎస్పీఎస్సీ పేపరు లీకేజీ బాధ్యుడైన రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ను మంత్రివర్గం నుండి వెంటనే బర్త్ రఫ్ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక ఇందిరా సెంటర్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్నగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్, దేశ్‌ముఖ్ సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుక్కడపు మహేష్, సుంకరి శివరాంయాదవ్, జక్కుల మల్లయ్య, బాచి మంచి గిరిబాబు, కౌన్సిలర్లు రాజు నాయక్, కోతి సంపత్‌రెడ్డి, ఎడవల్లి వీరబాబు, చక్కర వీరారెడ్డి, ఎంపీటీసీ వెంకటేశ్వర్లు , వెలిదండ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోదాడరూరల్ : పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్థలో టీఎస్పీఎస్సీ కమిషన్ పరీక్ష పేపర్ల లీకేజీని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ జామ్ కావడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇంతలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసిఆర్, కేటీఆర్ ఫ్లెక్సీ బొమ్మలను దగ్ధం చేయడానికి ప్రయత్నించారు. అది గమనించిన పోలీసులు అనుమతి లేదంటూ ఫ్లెక్సీ బొమ్మలను దగ్ధం చేయకుండా అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు. పట్టణ ఎస్సై రామాంజనేయులుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు వాగ్వాదానికి దిగారు. శాంతి యుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతకుంట్ల లక్మి నారాయణరెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అవుదొడ్డి ధనమూర్తి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంగవేటి రామారావు, గంధం జానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సూర్యాపేట : టీఎస్పీఎస్పీ ప్రశ్నాపత్రం లీకేజీకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు డిమాండ్ చేశారు.తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు పేపరు లీకేజీ ఘటనను నిరసిస్తూ ఆదివారం జిల్లాకేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ సంబందిత మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని, ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులను కఠినంగా శిక్షించాలనిడిమాండ్ చేశారు.పేపర్ లీకేజీకి సంబందించి మంత్రి కేటీఆర్ సిట్ విచారణను నిర్వీర్యం చేసే విధంగా మాట్లాడుతున్నారన్నారు.ఒక పక్క సిట్ దర్యాప్తు జరుగుతుంటే, ఈ ఘటనలో కేవలం ఇద్దరి ప్రమేయం మాత్రమే ఉందని కేటీఆర్ చెప్పడం శోచనీయమన్నారు. ఎంతో మంది నిరుపేద విద్యార్థులు ఏండ్ల తరబడి వేచి చూసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చిన నోటిఫికేషన్ లను చూసి కష్టపడి చదివి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన అర్హత పరీక్ష రాసి, ఉన్నత మార్కులు సాధించి, ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్న విద్యార్థులకు ప్రశ్నాపత్రం లీకేజీ అయ్యిందనే వార్త జీర్ణించుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకుని ఆత్మహత్యలకు పాల్పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వాధినేత కేసీఆర్ పట్టించుకోనట్టుగా ఉండడం క్షమించరానిదన్నారు.కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు కొప్పుల వేణారెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బైరు శైలేందర్, సేవాదళ్ జిల్లా చీఫ్ ఆలేటి మాణిక్యం, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, మండలఅధ్యక్షుడు కోతి గోపాల్‌రెడ్డి, కుమ్మరికుంట్ల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
తుంగతుర్తి: కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో సీఎంకేసీఆర్, మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు దొంగరి గోవర్థన్,ఉపాధ్యక్షులు వెంకన్న,రుద్ర రామచంద్రు,గుండగాని వెంకన్న,తూర్పుగూడెం ఉపసర్పంచ్ గుండగాని మహేందర్, పంజాల ప్రభాకర్, అన్నారం సర్పంచ్ మిట్టగడుపుల అనోక్, ఉప్పుల రాంబాబు, అబ్దుల్,నాగరాజు,గంగయ్య, శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.