Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్‌పహాడ్
బెల్టు షాపులు, ఇసుక దందా, మట్టి మాఫియా మొత్తం ఆ పార్టీ వాళ్ళదే అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డి విమర్శించారు. హత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా మండలంలో నిర్వహిస్తున్న పాదయాత్ర ధర్మాపురం, మేఘ్యతండా, రత్యాతండా, కేవ్లతండా, వేపలతండాలలో ఆదివారం కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ను ఆదరిస్తేనే ప్రజల కష్టాలు కనుమరుగవుతాయని, కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో అప్పుల పాలు చేశారు తప్ప ప్రజలకు ఏమి చేయలేదని అన్నారు. ధరణి పోస్టల్ రాకతో రైతులకు మేలు ఏమి చేకూరలేదని అన్యాయమే జరిగిందన్నారు. తెలంగాణ వస్తే విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశపడ్డారని వారి ఆశల్ని అడియాశలు చేశారని అన్నారు. ధర్మాపురంలో తెలుగుదేశం పార్టీకి చెందిన బుడిగం సతీష్ ఆయన అనుచరులు రమేష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు గద్దల నాగరాజు, కొండేటి పవన్ కుమార్, మాజీ ఎంపీటీసీ యాట ఉపేందర్, కుందూరు వెంకటరెడ్డి, బెల్లంకొండ శ్రీరాములు, స్వామి నాయుడు, ఫరూక్, బొల్లికొండ మనోహర్, లెనిన్, స్టాలిన్, తాళ్ళ కృష్ణ, చిట్యాల రాజు, నెమ్మాది సైదులు, ముక్కెర్ల విక్రమ్, పోలిశెట్టి ధనమూర్తి, తదితరులు పాల్గొన్నారు.