Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
మండల పరిధిలోని గొట్టిపర్తి,తిరుమలగిరి మండల పరిధిలోని జలాల్పురం గ్రామాలలో కురిసిన వడగండ్ల వానకు నష్టపోయిన మామిడి,మిర్చి తోటలను జిల్లా ఉద్యానవనశాఖ అధికారి బి.శ్రీధర్ ఆదివారం పరిశీలించారు.రెండు మండలాల పరిధిలో 1380 ఎకరాలలో మామిడి, మిరప తోటలకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు.ఈ సందర్శనలో తుంగతుర్తి ఉద్యానవనశాఖ అధికారి వి.స్రవంతి, రైతులు టి.యాదగిరి, జి.సోమన్న, నిమ్మల రామచంద్రు, శ్రీను, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.