Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
పట్టణంలోని పెరిక భవన్లో ఆదివారం డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్వహించడంతో ఇండ్లు వచ్చిన వారు ఆనందంతో ఉండగా ఇండ్లు రాక అనేక మంది దుఃఖంతో వెనుతిరిగారు. ఈ సందర్భంగా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల డ్రా అనడంతో అనేక మంది ఆశతో వచ్చారు. కుర్చీలు సరిపోకపోవడంతో అనేకమంది నేల మీదనే కూర్చున్నారు. ఆర్డీఓ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్సీలకు 60 శాతం, ఎస్టీలకు 10 శాతం, మైనార్టీలకు 10 శాతం, వికలాంగులకు ఐదు శాతం, జనరల్‌కు 15 శాతం విధంగా డ్రా నిర్వహించారు. పోలీస్ బందోబస్తు నడుమ డ్రా సుమారు 560 ఇండ్లకు డ్రా నిర్వహించారు. బీసీలకు తక్కువ ఇండ్లు కేటాయించడంతో అనేకమంది వెనుతిరిగి మహిళలు వెళ్లిపోయారు. అనేక సంవత్సరాలు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం వేచిచూస్తున్నామని అర్హులకు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో 30 వ వార్డులో కొంతమందికి ప్రజాప్రతినిధులు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం చేసిన వారు ఎవ్వరికీ రాకపోవడంతో ఆందోళన చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి బయలుదేరి రావడంతో విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల ఇండ్ల ముట్టడికి ప్రయత్నించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మార్వో శ్రీనివాస్‌శర్మ, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద ఆందోళన...
పట్టణ పరిధిలోని బాలాజీ నగర్లో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద గతంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ బాలాజీనగర్ వాసులకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తానని హామీ ఇచ్చాడని, ఇప్పుడు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు కంచే వేసి నిరసన తెలియజేశారు.