Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
విద్యార్థులు ఉన్నతమైన లక్షయాన్ని ఎంచుకొని, ఆ లక్ష్యసాధన కోసం నిరంతరం కృషి చేయాలని నాగార్జున నిట్స్, ఒలంపియాడ్ హైస్కూల్ కరస్పాండెంట్ మారగానివెంకట్గౌడ్ విద్యార్థులకు సూచించారు.ఆదివారం మండలకేంద్రంలోని నాగార్జున హైస్కూల్లో నిర్వహించిన పదవ తరగతి వీడ్కోలు సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల దశ నుండే తన జీవితంలో సాధించాల్సిన లక్ష్యాల కోసం ఇష్టపడి చదివి జీవితంలో స్థిరపడాలని సూచించారు.అనంతరం విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పలువుర్ని అలరింపజేశాయి.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మారగాని విజయలక్ష్మీ,ఉపాధ్యాయులు గుర్రం యాదగిరిగౌడ్, రమేష్, సందీప్, సాయిరాం, వీరన్న, రాజేశ్వరి, శ్రీలత ,రాజేశ్వరి, మాధవి, ప్రియాంక, తదితరులు పాల్గొన్నారు.