Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూర్ ఎస్
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు విప్లవ కెరటం విప్లవ జ్వాల ఎగురుతున్న నిప్పు కనిక మల్లు స్వరాజ్యం అని సీపీఐ(ఎం) మండలకమిటీసభ్యులు సానబోయిన ఉపేందర్ అన్నారు.మండలంలోని ఏపూరు గ్రామంలో ఆదివారం మల్లు స్వరాజ్యం ప్రథమ వర్థంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి ఆయన పూలమాలలేసి నివాళులర్పించారు.అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్వరాజ్యం గారి మొదటి వర్ధంతి సభకు ఏపూర్ గ్రామం నుండి తరలివెళ్లారు.ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శులు తొండల నారాయణ, బెల్లంకొండ ఇస్తారి, నాయకులు రాంమల్లు, మల్లయ్య, వెంకటయ్య, యువజన సంఘం నాయకులు ఎరుకల నాగరాజు, బెల్లంకొండ రవి ,శేషగిరి, మల్లయ్య, ఉపేందర్, తదితరులు తరలి వెళ్లారు.
తుంగతుర్తి :భూమికోసం,భుక్తి కోసం,విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మల్లు స్వరాజ్యం పాత్ర కీలకమని పాదూరి కరుణ,మల్లు కపోతంరెడ్డి,భీమ్‌రెడ్డి ప్రభాకర్‌రెడ్డిలు అన్నారు.మండలపరిధిలోని కొత్తగూడెం గ్రామంలో మల్లు స్వరాజ్యం ప్రథమవర్థంతి వేడుకల సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించి మాట్లాడారు.అనంతరం మల్లు స్వరాజ్యం ప్రథమవర్థంతి సందర్భంగా అంకితం చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో యశోధ హాస్పిటల్ వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వంద మందికి పైగా రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలంయాదవ్,స్థానిక సర్పంచ్ నకిరేకంటి విజరు,మెంతబోయిన సింహాద్రి,రాములు,నిరంజన్‌రెడ్డి,వారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
అర్వపల్లి : సూర్యాపేటలోని రాయినిగూడెం వద్ద జరిగే మల్లు స్వరాజ్యం ప్రథమ వర్థంతి సభకు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వజ్జె శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.తరలిన వారిలో వజ్జె సైదయ్య, వజ్జె వినరుయాదవ్ పనస భంద్రయ్య, స్వరాజ్యం అభిమానులు ఉన్నారు.
పాలకవీడు:మల్లు స్వరాజ్యం మొదటి వర్థంతి కార్యక్రమాన్ని ఆదివారం పాలకీడు మండలం బొత్తలపాలెం గ్రామంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కమిటీ సభ్యులు కందగట్ల అనంత ప్రకాష్ హాజరై మాట్లాడారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు, దిద్దకుంట్ల పురుషోత్తంరెడ్డి, తరికొండ వెంకటేశ్వర్లు, వడ్డే సైదయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు ఆర్లపూడి వీరభద్రం, సీపీఐ(ఎం) యూత్ అధ్యక్షుడు కట్టబోయిన లింగయ్య, కొనకంచి అంజయ్య, పాలకీడు మాజీ సర్పంచ్ బైరెడ్డి రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.