Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లినర్సిరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
ఉద్యోగుల,ప్రభుత్వ ఉపాధ్యాయుల,పెన్షనర్ల పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, నిలిచిపోయిన ఉపాధ్యాయుల బదిలీలు,ప్రమోషన్ల ప్రక్రియకు ఉన్న న్యాయపరమైన ఆటంకాలను అధిగమించి బదిలీలు చేయాలని పదోన్నతులు ఇవ్వాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లినర్సిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.పండిట్, పీఈటీల ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు.ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతిలో చేరే వయస్సును ఆరేండ్లుగా నిర్ణయించడం కార్పొరేట్ విద్యా సంస్థల కోసం తప్ప ప్రభుత్వ పాఠశాలలకు ఉపయోగపడదని పేర్కొన్నారు.ఒకటో తరగతిలో చేరే వయస్సు ఐదేండ్లుగానే సాగించాలని డిమాండ్ చేశారు.టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్.రాములు మాట్లాడుతూ రాబోయే విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠ్య పుస్తకాలను, ఏకరూప దుస్తులను సకాలంలో అందించాలని కోరారు.పాఠశాల గ్రాంట్లను విద్యాసంవత్సరం ఆరంభంలోనే జమ చేయాలని, పాఠశాలలో స్వీపర్లను నియమించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కమిటీ అధ్యక్షులు ఎన్.సోమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్‌కుమార్, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు జే.యాకయ్య, జిల్లా కార్యదర్శి బి.పాపిరెడ్డి,బి.ఆడమ్, జిల్లా కమిటీసభ్యులు డి.లాలు, బి.రమేష్,కర్నాకర్‌రెడ్డి, బి.ఆనంద్, ఏ.శీనయ్య, సీనియర్ నాయకులు వై.వెంకటేశ్వర్లు,ఎన్వి.సత్యనారాయణ,ఏ.వెంకటేశ్వర్లు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.