Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
శనివారం రాత్రి మండల పరిధిలోని గొట్టిపర్తి,రావులపల్లి,మానాపురం, వెంపటి గ్రామాల్లో కురిసిన వడగండ్ల వానకు జరిగిన పంటనష్టాన్ని గుర్తించి రైతులను ఆదుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి రామారావునాయక్ అన్నారు.ఆదివారం తుంగతుర్తి సహాయ వ్యవసాయ సంచాలకులు జగ్గు నాయక్, మండలవ్యవసాయ అధికారి బాలకృష్ణ,ఏఈఓ సాయిశ్రీజనలతో కలిసి ప్రాథమిక అంచనా నివేదికను తయారు చేశారు.ఈ నివేదిక ప్రకారం మండలంలో వరి-6235 ఎకరాలు, రైతులు-1420 మంది,మొక్కజొన్న 20-ఎకరాలు రైతులు- 20 మంది, మామిడి-920 ఎకరాలు, రైతులు- 162 మంది,మిరప-186 ఎకరాలు, రైతులు-91 మంది, నష్టపోయినట్లుగా అంచనా వేశామన్నారు.మొత్తం మీద మండలంలో అన్ని పంటలు కలిపి 7355 ఎకరాలు,1693 మంది రైతులు నష్టపోయినట్లు ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి పంపడం జరిగిందని తెలిపారు.ప్రభుత్వ ఆదేశానుసారం తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గొట్టిపర్తి సర్పంచ్ చందావెంకన్న,రావులపల్లి ఎక్స్‌రోడ్ తండా సర్పంచ్ గుగులోతు వెంకన్న, వెంపటి సర్పంచ్ అబ్బగాని పద్మ సత్యనారాయణగౌడ్ పాల్గొన్నారు.