Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుసంఘం రాష్ట్ర నాయకులు మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
తెలంగాణ సాయుధ పోరాట యోధులు జాటోత్ ఠానునాయక్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై పెట్టాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర నాయకులు మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు.తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక గిరిజన సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన ఠాను నాయక్ 73వ వర్థంతిసభలో ఆయన మాట్లాడారు.తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమంలో పీడిత ప్రజల విముక్తి కోసం నాటి నిజాం రజాకార్ల దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తుపాకీ చేత బట్టి గిరిజన తండలా విముక్తి కై పోరాడి నేల కోరిగిన వీరుడు ఠాను నాయక్ అని కొనియాడారు.తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భానోత్ రాజేందర్‌నాయక్ మాట్లాడుతూ నాడు నిజాం అతని సైన్యం చేసిన దురాగతాలకు వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేసి భూమిలేని పేదలకు భూమి పంచిన వీరుడు అన్నారు.నాటి పాలకులు అవలంబిస్తున్న విధానాల వల్ల పేదలు గిరిజనులు బతకలేని స్థితిలో ఉన్నారన్నారు.విద్య, వైద్యంతో పాటు అన్ని ప్రభుత్వరంగాలను ప్రయివేటుపరం చేశారాని తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యాయన్నారు.భూమి లేని గిరిజన పేదలకు మూడెకరాలు ఇవ్వాలని, గిరిజనబంధును అమలు చేయాలని కోరారు.గిరిజనులకు ఇండ్లు, స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌చేశారు.అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు,కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, సీఐటీయూ జిల్లా నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, చెరుకు ఏకలక్ష్మి, జిల్లా అధ్యక్షులు రాంబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వినోద్, ధనియాకులశ్రీకాంత్, పట్నం జిల్లా కార్యదర్శి జె.నర్సింహారావు, జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి వీరబోయిన రవి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు చినపంగ నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.