Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవన నిర్మాణకార్మికసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరాజు
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను మార్చు కోవాలని హెచ్చరిస్తూ తలపెట్టిన సీఐటీయూ, వ్యవసాయ కార్మికసంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న ఢిల్లీలో జరిగే మజ్దూర్- కిసాన్ సంఘర్షణ ర్యాలీకి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నకరం కోటంరాజు పిలుపునిచ్చారు. కార్పొరేట్ శక్తులకు కార్మికుల శ్రమను దోచిపెట్టె కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించడమే కార్మికుల లక్ష్యమన్నారు.సోమవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు అనంతులమల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన ఆ సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాటా ్లడారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను ఉపసంహ రించుకోవాలని డిమాండ్ చేశారు.1979 వలస కార్మికులచట్టం 1996 భవననిర్మాణకార్మిక చట్టం 1998 సెస్ చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం.రాంబాబు, కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, సహాయకార్యదర్శి ఏకలక్ష్మి, భవననిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి సంఘం యల్క సోమయ్యగౌడ్, ఉపాధ్యక్షులు తిరుమలేష్,కరిమెల శేఖర్, సహాయకార్యదర్శి లకావత్ బాలాజీనాయక్, లింగయ్య, వెంకన్న ,శ్రీనివాస్, శేఖర్,సైదులు, తదితరులు పాల్గొన్నారు.