Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ జీడిభిక్షం కోరారు.సోమవారం మండలపరిధిలోని సోలిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో కంటివెలుగుశిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు.కంటి సమస్యలు ఉన్నవారు తప్పని సరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం మన ఊరు- మనబడి పథకంలో భాగంగా పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను పరిశీలించారు.పనులను సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బీరవోలు శోభారాణి,వైస్‌ఎంపీపీ శ్రీనివాస్‌నాయుడు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంగాల శ్రీనివాస్‌రెడ్డి,సపావత్తండా సర్పంచ్ లాలునాయక్, ఉపసర్పంచ్ నర్రాసుగుణమ్మ, వార్డు సభ్యులు ఈదుల భవాన, బండి లక్ష్మమ్మ,గోగిరెడ్డి వెంకట్ రెడ్డి,తడకమళ్ళ సుధాకర్,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.