Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
బీఆర్ఎస్ ఆవిర్భావం నుండి తాను నియోజకవర్గంలో పార్టీబలోపేతం కోసం కృషి చేశానని, తనకు ఒక్కసారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలిచి తీరుతానని రాష్ట్ర మాజీ గిడ్డంగుల సంస్థ చైర్మెన్ మందుల సామేల్ అన్నారు.సోమవారం మండలపరిధిలోని దేవునిగుట్టతండాలో వెలిసిన వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా రూ.10వేలు అందజేసి మాట్లాడారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి తాను కేసీఆర్ వెంట ఉంటూ తుంగతుర్తి నియోజకవర్గంలో పార్టీ ఆదేశించిన కార్యక్రమాలను అమలు చేస్తూ పార్టీ అభివృద్ధి కోసం తనవంతు కృషి చేశానని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అలుపెరుగని పోరాటాలు చేశానన్నారు. రాష్ట్ర ఏర్పాటులో నియోజక వర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి, నియోజకవర్గంలో ఎక్కువ ప్రజా ప్రతినిధులను గెలిపించిన చరిత్ర తనకు ఉందన్నారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేశానన్నారు. తన కృషిని గుర్తించి. ముఖ్య మంత్రి కేసీఆర్ రెండుసార్లు కార్పొరేషన్ పదవులు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు . నియోజకవర్గంలో అత్యధికంగా మాదిగ సామాజిక వర్గం ఉన్నందున ఉద్యమకారునిగా, కార్మికునిగా గుర్తించి, ఈసారి తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పూసపెళ్లి భిక్షం,ఓరుగంటి సత్యనారాయణ, కృష్ణ,రవి,రాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.